హైదరాబాద్‌లో టెక్నికల్ & ఫండమెంటల్ వర్క్‌షాప్.
ప్రత్యక్షంగా ఎనలిస్టులను కలిసి మాట్లాడే అవకాశం.స్టాక్ మార్కెట్లలో జోరు బాగానే కనిపిస్తోంది. ఆల్‌టైం హై లెవెల్స్‌కు దూసుకుపోయిన ఇండెక్స్‌లు ఇప్పుడు కొంత ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ కదలికలు, ఇన్వెస్టర్లకు అంతు చిక్కడం లేదు. అందుకే ఇది మన మార్కెట్లకు అత్యంత కీలకమైన సమయం.


ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన కంటే ఆలోచన అవసరం. రాబోయేది ఎన్నికల సీజన్. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగిపోతున్నాయి, రూపాయి ధర కనీవినీ ఎరుగని స్థాయికి క్షీణించింది. మన మార్కెట్లను అంతర్జాతీయ పరిణామాలు శాసిస్తున్నట్లుగా ఉన్నాయి. మార్కెట్లలో ఇంకా డ్రీమ్ రన్‌కు అవకాశం ఉందా లేదా అనే విషయంపై ఇన్వెస్టర్లు అంచనాకు రాలేకపోతున్నారు. పోర్ట్‌ఫోలియో నిర్వహణ విషయంలో ఇప్పుడు నిపుణుల సలహాలు తప్పనిసరి. సరైన స్టాక్స్‌ను ఎంచుకోవడం, విలువ లేని స్టాక్స్‌ను వదిలించుకోవడం.. పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునేందుకు ఇలాంటి పతనాలు అద్భుత అవకాశాన్ని కల్పిస్తాయి.


వీటికి తోడు రాబోయే రోజుల్లో ఏ సెక్టార్ లాభాలను కురిపిస్తుంది అనే అంశాలతో పాటు, ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్స్‌ను పంచుకునేందుకు టీవీ5 మనీ & ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్‌లు సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహించనున్నాయి. మీ అభిమాన ఎనలిస్టుల మాటలను ప్రత్యక్షంగా వినడంతో పాటు, వారిని అడిగి మీ సందేహాలను ముఖాముఖిగా తీర్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.


రెండు రోజుల పాటు జరిగే ఫుల్ లెంగ్త్ టెక్నికల్, ఫండమెంటల్ వర్క్‌షాప్‌లో అనేక అంశాలను మీరు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. బేసిక్స్‌ నుంచి, ఇప్పుడు అడ్వాన్స్‌డ్ థియరీస్ వరకూ చాలా విషయాలను మీకు ఎనలిస్టులు వివరించబోతున్నారు.


టెక్నికల్ వర్క్‌షాప్ 29-09-2018 (శనివారం)

ఎనలిస్టులు - బి రాజేంద్ర, ఏ శేషు, వి సుందర రాజా

ఫండమెంటల్ వర్క్‌షాప్ 30-09-2018 (ఆదివారం)

ఎనలిస్టులు - శ్రీ సి కుటుంబరావు (Confirmation Awaited),
వి అర్వింద, పి. బాలసుబ్రమణ్యం

వేదిక (Venue)

బొమ్మరిల్లు ఫంక్షన్‌ హాల్, మియాపూర్ జంక్షన్, హైదరాబాద్.

( Bommarillu Function hall, Opp. Bus Stop, Miyapur Junction, Hyderabad. )

Hyderabad workshop Schedules

Workshop Registration

Registration Amount

RS:

I authorise www.heartbeatmedia.in & its representatives to call me or SMS me with reference to my application.